మట్టి గణపతి - మహా గణపతి
మట్టి గణపతి - మహా గణపతి - clay ganesh idols making training at mancherial
మంచిర్యాల జిల్లా అటవీశాఖ కార్యాలయంలో నేషనల్ గ్రీన్ కోర్, కుమ్మరి సంఘం సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మట్టి వినాయకుల తయారీ శిక్షణను ఇచ్చారు.
![మట్టి గణపతి - మహా గణపతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4301121-972-4301121-1567258029770.jpg)
మట్టి గణపతి - మహా గణపతి
మంచిర్యాల జిల్లా అటవీశాఖ కార్యాలయంలో 'మట్టి గణపతి మహా గణపతి' కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టి గణపతులతో పర్యావరణానికి జరిగే మేలు వివరిస్తూ నేషనల్ గ్రీన్కోర్ కమిటీ, కుమ్మరి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు మట్టి గణపతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. కుమ్మరి సంఘం సభ్యులు మట్టి గణపతుల తయారీ వివరిస్తుండగా విద్యార్థులు విగ్రహాలు తయారు చేశారు.
- ఇదీ చూడండి : అసోంకు ఎమ్మెల్యేలే... కానీ భారతీయులు కారు.!