మంచిర్యాల జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. రెండు రోజుల క్రితం దండేపల్లి మండలంలో రెండువేల బాయిలర్ కోళ్లు మృత్యువాత పడగా... తాజాగా లక్షెట్టిపేట మండలం గుల్లకోటలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఫాంలలో నాలుగు వేలు వరకు మృతిచెందాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతుచిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి - మంచిర్యాలలో కోళ్లు మృతి
అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృతి చెందుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం గుల్లకోటలోని కోళ్ల ఫాంలో నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి.

అంతుచిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి
మృతి చెందిన వాటిని పూడ్చివేస్తుండడం వల్ల... కొనఊపిరితో ఉన్న వాటిని తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.
ఇదీ చూడండి:రామప్ప దర్శనానికి 'భగీరథ' యత్నం చేయాల్సిందే!