తెలంగాణ

telangana

ETV Bharat / state

మందమర్రిలో రూ.5 కోట్లతో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు - చెన్నూరు నియోజకవర్గం

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని మందమర్రిలో రూ.5 కోట్ల రూపాయలతో నైపుణ్య శిక్షణ కేంద్రం నూతన భవనానికి ఎమ్మెల్యే బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు.

మందమర్రిలో రూ.5 కోట్లతో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు
మందమర్రిలో రూ.5 కోట్లతో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు

By

Published : Jun 2, 2020, 11:00 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలో రూ.ఐదు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రం భవనానికి చెన్నూరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత శంకుస్థాపన చేశారు.

శిక్షణ మాత్రమే కాదు.. ఉద్యోగాలు కూడా

ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి శిక్షణ ఇవ్వడమే కాకుండా పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసేందుకు నిపుణుల సాయంతో శిక్షణ అందిస్తామని బాల్క సుమన్ తెలిపారు. నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుతో కోల్​ బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరుతుందని సుమన్ అన్నారు.

అందుకే రైతు వేదిక..

రైతుల సమస్యల పరిష్కారం కోసమే రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్​ ఫామ్ సాగుపై రైతులు దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్యే సూచించారు. దీని వల్ల రైతులకు చాలా లాభాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : సింగరేణిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details