మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కొవిడ్ బాధితులకు సాయం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసేందుకు ముందుకొచ్చారు. మూడు మున్సిపాలిటీలు, ఐదు మండలాల్లోని కరోనా రోగులకు పండ్లు, డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
కరోనా బాధితులకు బాల్క సుమన్ చేయూత - chennur mla, govt whip balka suman latest news
కరోనా రోగులకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సాయం చేయనున్నారు. కరోనా రోగులను గుర్తించి పండ్లు, డ్రైఫ్రూట్స్ పంపిణీ చేయనున్నారు.

కరోనా బాధితులకు బాల్క సుమన్ చేయూత
హోం ఐసోలేషన్లో ఉంటున్న 1,896 మందిని గుర్తించి, ఒక్కొక్కరికి రూ.800 విలువైన పండ్లు అందిస్తామని బాల్కసుమన్ తెలిపారు. తన సొంత ఖర్చులతో వీటిని పంపిణీ చేస్తున్నానని ఎమ్మెల్యే వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో ఈ పొట్లాలను పంపించారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో