ముఖ్యమంత్రి కేసీఆర్‌ది రైతు సంక్షేమ సర్కార్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు.
ప్రగతి పథంలో తెలంగాణ వ్యవసాయ రంగం : మంత్రి నిరంజన్ రెడ్డి - chennur marketing committee Working group
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో రైతులకు పెద్దపీట వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు.
ప్రగతి పథంలో తెలంగాణ వ్యవసాయ రంగం
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జడ్పీ ఛైర్పర్సన్ భాగ్యలక్ష్మి, పాలనాధికారి భారతి హొళ్లికేరీ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం కేసీఆర్