మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శాసనసభ్యులు దివాకర్ రావు సోడియం హైపోక్లోరైట్ పిచికారి యంత్రాలను ప్రారంభించారు. కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో యూపీఎల్ సంస్థ ఈ యంత్రాన్ని సమకూర్చిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రతి ఒక్కరూ విధిగా లాక్ డౌన్ పాటించాలని ఆయన కోరారు.
కరోనా నివారణకు పిచికారి యంత్రం... ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు - అవసరమైన సామగ్రి వారానికి సరిపడ ముందస్తుగానే కొనిపెట్టుకోవాలి : ఎమ్మెల్యే
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మంచిర్యాల పట్టణంలోని కాలనీలు, ప్రధాన రహదారుల్లో పిచికారి యంత్రాలతో రసాయనాలు చల్లుతున్నారు. ఈ పిచికారి యంత్రాలను యూపీఎల్ సంస్థ సమకూర్చిందని ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడించారు.
వారానికి సరిపడ వస్తువులను ముందస్తుగానే కొనిపెట్టుకోవాలి : ఎమ్మెల్యే
కొంత మంది జనం కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఏమీ కాదనే భావనతో విచ్చలవిడిగా రహదారులపైకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులకు సరిపడా నిత్యవసర సరకులను, కూరగాయలను కొనుగోలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అసలు బయటకే రావొద్దని సూచించారు. ఈ నెల 15 వరకు ప్రజలందరూ ఓపికగా గృహనిర్బంధంలోనే ఉండాలని స్పష్టం చేశారు.
TAGGED:
MLA CHEMICALS SPRAY