తెలంగాణ

telangana

ETV Bharat / state

వేటగాళ్ల ఉచ్చులో మరో చిరుత బలి - FOREST DEPARTMENT NEGLIGENCE

ఎన్ని కేసులు పెట్టినా, మరెన్నో శిక్షలు విధించినా కొందరు అటవీ జంతువుల వేట మాత్రం మానట్లేదు. ఏ మాత్రం అవకాశం దొరికినా స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఫలితంగా పులుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.

చిరుత పులి చర్మాన్నిస్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు

By

Published : Mar 25, 2019, 10:18 AM IST

Updated : Mar 25, 2019, 1:15 PM IST

అమ్మకానికి తరలిస్తుండగా పట్టుబడ్డ చిరుత పులి చర్మం
మంచిర్యాల జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ఘటన మరువకముందే మరో చిరుత పులి చర్మం పట్టుబడటం కలకలం రేపింది. వేమనపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి స్మగ్లర్లు చిరుత పులి చర్మాన్ని అమ్మకానికి తరలిస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేస్తోన్న సీసీఎస్ పోలీసులకు చిక్కారు.

డబ్బు కోసం దేన్నైనా వేటాడతాం

చిరుత పులి చర్మం, గోర్లు రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్యేక పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ముఠాలో మిగతా నలుగురు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర సమీపంలోని ముంజవేని ప్రాంతంలో పులుల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల ఇటీవల కాలంలో అక్కడ వేట పెరిగింది. అలా చంపిన వాటినే ఇతర ప్రాంతాల్లో విక్రయించడానికి రవాణా చేస్తూ పట్టుబడ్డారు ఈ స్మగ్లర్లు.

నిర్లక్ష్యపు మత్తులో అటవీశాఖ

అటవీ సంరక్షణపై ప్రభుత్వం ఎంత సీరియస్​గా ఉన్నా... అటవీశాఖ సిబ్బంది పనితీరు ఆశాజనకంగా లేదు. ఉన్నతాధికారులు ఇకనైనా.. స్పందించి.. నిఘా తీవ్రతరం చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Last Updated : Mar 25, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details