తెలంగాణ

telangana

ETV Bharat / state

Cow Calf Barasala : ఘనంగా ఆవుదూడల బారసాల వేడుక - మంచిర్యాలలో ఆవుదూడలకు బారసాల

Cow Calf Barasala : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కోడెదూడల బారసాల వేడుక ఘనంగా జరిగింది. పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ... తమ ఇంట్లోని రెండు ఆవులకు జన్మించిన ఆవు దూడలకు బారసాల నిర్వహించి నామకరణం చేశారు. కార్యక్రమంలో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Cow Calf Barasala
Cow Calf Barasala

By

Published : Feb 24, 2022, 10:47 PM IST

Cow Calf Barasala : భారతీయ సంస్కృతిలో గోవులకు ప్రత్యేక స్థానం ఉంది. గోవును దైవంగా పూజించే సంస్కృతి మనది. తమ ఇంట ఆవులకు జన్మించిన ఆవు దూడలకు బారసాల నిర్వహించి.. నామకరణం చేశారు ఓ వ్యక్తి. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి.. లక్ష్మీనారాయణకు రెండు ఆవులు ఉన్నాయి. వాటికి జన్మించిన దూడలకు బారసాల వేడుక నిర్వహించారు. దూడలను ఉయ్యాలలో వేసి, అందంగా అలంకరించి నామకరణ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొని గోవులకు పూజలు చేశారు.

లక్ష్మీనారాయణ ఇంట ఉన్న లక్ష్మీ అనే ఆవు జనవరి 30న దూడకు జన్మనిచ్చింది. కాగా.. సిరి అనే ఆవు ఫిబ్రవరి 12న దూడకు జన్మనిచ్చింది. ఈ రెండు దూడలకు ఇవాళ బారసాల వేడుక నిర్వహించారు. ఆ దూడలకు కన్నయ్య, బసవయ్యగా పేర్లు పెట్టారు. ఈ వేడుకలకు బంధు, మిత్రులతో పాటు స్థానికులను ఆహ్వానించారు. వేడుకలో పాల్గొన్న మహిళలు గోవులకు పూజలు చేశారు.

ఘనంగా ఆవుదూడల బారసాల వేడుక

ఇదీ చూడండి :Bio Asia 2022: కరోనా సమయంలో భారత్ త్వరగా స్పందించింది: బిల్​గేట్స్

ABOUT THE AUTHOR

...view details