తెలంగాణ

telangana

ETV Bharat / state

చర్చిలో యువకుడి మృతిపై కమిషనర్ విచారణ - brain tumar

బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడతున్న యువకుడు దేవుడి మీద నమ్మకంతో చర్చికి వెళ్లాడు. మూడు రోజులుగా అక్కడే ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన నిర్వాహకులు సకాలంలో స్పందించకపోవడం వల్ల అతను మృతి చెందాడు.

మృతిపై కమిషనర్ విచారణ

By

Published : May 30, 2019, 11:15 AM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వరి చర్చిలో యువకుడి మృతిపై రామగుండం పోలీస్ కమీషనర్ సత్యనారాయణ విచారణ చేపట్టారు. ఈ నెల 25న సూర్యాపేటకు చెందిన రాజేష్ తీవ్రమైన జ్వరంతో మృతి చెందాడు. బ్రెయిన్ ట్యూమర్​తో బాధపడతున్నా.. మూడు రోజులుగా చర్చిలోనే ఉన్న అతని పరిస్థితి చూసి ఆసుపత్రిలో చేర్చి ఎందుకు చికిత్స అందించలేదు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చర్చి నిర్వాహకుల తీరు వల్లే తన కుమారుడు మృతి చెందాడని మృతుని తల్లి ఫిర్యాదు చేసింది. నిర్వాహకులపై సెక్షన్ 304 నమోదు చేశామని సీపీ తెలిపారు.

మృతిపై కమిషనర్ విచారణ

ABOUT THE AUTHOR

...view details