మంచిర్యాలలోని ఓంసాయి ఆసుపత్రిలో ఐదేళ్ల బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేశారు. మందమర్రి మండలం కోటేశ్వరరావు పల్లెకు చెందిన బాలునికి తీవ్రమైన కడుపు నొప్పి రావటం వల్ల గతరాత్రి ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం బాలుడిని ఇంటికి తీసుకెళ్లాక బాలుడు మృతి చెందాడు. తమ కుమారుడికి సరైన వైద్యం అందించకపోవటం వల్లే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
వైద్యం వికటించి బాలుడి మృతి... ఆసుపత్రి ఎదుట ఆందోళన - Manchiryala
వైద్యం వికటించి బాలుడి మృతి చెందిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ... ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.
వైద్యం వికటించి బాలుడు మృతి