మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు భాజపా ఆధ్వర్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. కేసులను దృష్టిలో ఉంచుకొని అందుకు సరిపడా వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడి నివారించాలని జిల్లా భాజపా అధ్యక్షుడు రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రం లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రుల మోసాలను అరికట్టాలని భాజపా ధర్నా!
కరోనా వైరస్.. కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న మోసాలను అరికట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా భాజపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను అలుసుగా తీసుకొని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడికి దిగాయని, పేదలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
తమ సొంత ఖర్చులతో జిల్లాలో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం అందుకు అంగీకరించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రులపై ప్రభుత్వం ఆజమాయిషీ చేయకుండా.. చోద్యం చూస్తున్నదని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తూ.. ఇష్టమొచ్చినట్టు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చూడండి : ఒకప్పుడు ఆటలో మేటి.. విధి వక్రించి బతుకు భారమైంది!