తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ పుట్టినరోజున.. 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. కరోనా కాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలు చేశారని భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కొనియాడారు.

BJP morcha honored sanitation workers on the occasion of modi birthday
మంచిర్యాలలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

By

Published : Sep 17, 2020, 4:14 PM IST

కరోనా వంటి ఆపత్కాలంలోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేశారని భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలంతా ఎల్లవేళలా రుణపడి ఉండాలని అన్నారు. వారి సమస్యలు పరిష్కరించడానికి భాజపా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని భరోసానిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details