మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, తాండూరు మండలంలో భాజపా నాయకులు ఆందోళన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. తాండూరు మండల కేంద్రంలో నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేపట్టారు. అనంతరం బెల్లంపల్లి రాష్ట్రీయ రహదారిపై భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
మంచిర్యాల జిల్లాలో భాజపా నేతల అరెస్ట్ - BJP LEADERS ARREST
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మంచిర్యాల జిల్లాలో భాజపా నేతల అరెస్ట్