తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ కబ్జాలను నిరసిస్తూ భాజపా ఆందోళన - నస్పూర్​ పురపాలికలో భాజపా ధర్నా

అధికారం అడ్డుపెట్టుకుని తెరాస నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని భాజపా నాయకులు విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్​ మండలకేంద్రంలో రహదారిపై భారీఎత్తున ఆందోళన నిర్వహించారు.

bjp dharna in naspoor muncipality for land grabbing by trs leaders
తెరాస నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ భాజపా ధర్నా

By

Published : Dec 21, 2020, 7:55 PM IST

పేదల ఇళ్లపట్టాలకు కేటాయించిన భూమిని తెరాస నాయకులు కబ్జా చేస్తున్నారంటూ భాజపా శ్రేణులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్​ పురపాలికలో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు ఆధ్వర్యంలో రహదారిపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

పురపాలిక పరిధిలోని ప్రభుత్వ భూములను కాంగ్రెస్​ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇస్తే... తెరాస నాయకులు వాటిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అండతో ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. పేద ప్రజలకు వారి భూములు అందించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని రఘునాథ్​రావు హెచ్చరించారు.

ఇదీ చూడండి:అప్పుడు ఇల్లు కడితే అప్పుల పాలే..: మంత్రి హరీశ్

ABOUT THE AUTHOR

...view details