మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ... భాజపా ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, శ్రేణులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
'కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలి' - Naspur tehsildar office latest news
కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ... భాజపా శ్రేణులు, కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. నస్పూర్‌లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.

'కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించాలి'
తీగల పహాడ్ శివారులోని 22 సర్వే నంబర్లో రెండెకరాల 37 గుంటలు, 26 సర్వేనంబర్‌లో 6 ఎకరాల 20 గుంటలు, నస్పూర్ శివారులో 119, 72 ,64 ,42 సర్వేలోని ప్రభుత్వ భూములను సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని అన్నారు. ప్రజలకోసం డబుల్ బెడ్ రూమ్‌లు కట్టించాలని కోరారు. భాజపా శ్రేణులతో ముట్టడికి యత్నించిన తహసీల్దార్‌కు వినతి పత్రాలు సమర్పించారు.