తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhatti: 'ప్రజా సమస్యలన్నీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం' - Bhatti Vikramarka Latest News

Bhatti Vikramarka Peoples March Padayatra: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్ల వాగు భూములు అన్యాక్రాంతం అయ్యాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ఫలితంగా ఇక్కడి ప్రజలు వరదల బారిన పడుతున్నారని దుయ్యబట్టారు. కనీసం జిల్లా కేంద్రానికి ఉండాల్సిన సౌకర్యాలు కరువయ్యాయని ఆయన విమర్శించారు.

Bhatti Vikramarka
Bhatti Vikramarka

By

Published : Apr 16, 2023, 8:22 PM IST

Bhatti Vikramarka Peoples March Padayatra:సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో చివరి రోజు కొనసాగుతుంది. అనంతరం ఎల్లంపల్లి జలాశయం మీదుగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. ఇందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏఐసీసీ సభ్యులు ప్రేమ్‌సాగర్ రావు నివాసం నుంచి భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలోనే మేదరివాడలో వెదురు బుట్టలు తయారు చేస్తున్న మహిళలతో భట్టి ముచ్చటించారు. వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

కనీస సౌకర్యాలు కరువయ్యాయి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్ల వాగు భూములు అన్యాక్రాంతం అయ్యాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. తద్వారా ఇక్కడి ప్రజలు వరదల బారిన పడుతున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన కనీస సౌకర్యాలు కరువయ్యాయని దుయ్యబట్టారు. మాతాశిశు కేంద్రాన్ని ముంపునకు గురయ్యే ప్రాంతంలో కట్టవద్దని ప్రభుత్వానికి చెప్పామని అన్నారు. కానీ నిధుల కోసం.. అందులో కమిషన్‌ల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడుకొని.. ఆ మునిగిపోయే ప్రాంతంలో ఆసుపత్రి కట్టించారని ఆక్షేపించారు. వరదల వల్ల ఆ ప్రాంతమంతా మునిగిపోయిందని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తాం: ఫలితంగా వరదల వల్ల ఆసుపత్రి మునిగిపోయిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టాల్సింది ప్రజల సంక్షేమానికి అని వివరించారు. ఎమ్మెల్యేగా నాలుగుసార్లు గెలిచిన దివాకర్ రావు మంచిర్యాల నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. 31 రోజులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో తన పాదయాత్ర ద్వారా.. ఎంతోమంది ప్రజల సమస్యలు తెలుసుకున్నానని అన్నారు. తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

"మాతాశిశు కేంద్రాన్ని ముంపునకు గురయ్యే ప్రాంతంలో కట్టవద్దని ప్రభుత్వానికి చెప్పాం. కానీ నిధుల కోసం, అందులో కమిషన్‌ల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడుకొని ఆ మునిగిపోయే ప్రాంతంలో ఆసుపత్రి కట్టించారు. కానీ వరదల వల్ల ఆ ప్రాంతమంతా మునిగిపోయింది. రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టాల్సింది ప్రజల సంక్షేమానికి.. శాసనసభ్యుల కోసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు."- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ప్రజల సమస్యలన్నీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం

ABOUT THE AUTHOR

...view details