తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలతో పాటు.. స్థలం కూడా'..

Bhatii fires on BRS government: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు శాపంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పంట భూములు ముంపునకు గురవుతున్న ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని భీమారం మండలంలో సాగుతున్న పాదయాత్రలో ఆయన చెప్పుకొచ్చారు.

bhatii vikramarka fires on brs government in macherial district
'అధికారంలోకి వస్తే పేదలు ఇళ్లు కట్టుకోవడానిక రూ.5 లక్షలతో పాటు స్థలం కూడా'..

By

Published : Apr 2, 2023, 3:50 PM IST

Bhatii fires on BRS government: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు శాపంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. వేలాది ఎకరాల్లో పంట భూములు ముంపునకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసి వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్లు కట్టిస్తామని ఆయన పాదయాత్రలో చెప్పుకొచ్చారు.

"సింగరేణి ప్రాజెక్టుకు సంబంధించినటు వంటి బొగ్గు ప్రాజెక్టులన్నింటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. బొగ్గును తవ్వేదానిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి స్థానికంగా వేలాది మంది ప్రజలకు, యువతీ యువకులకు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఈరోజు రాష్ట్రంలో సాగుతోంది. మన రాష్ట్రం మనకొస్తే మన ఉద్యోగాలు మనకొస్తాయని ఇక్కడున్న యువతీ యువకులు పెద్దఎత్తున పోరాటం చేశారు. చేసినటువంటి పోరాట ఫలితంగా మీ లక్ష్యాలు నెరవేరాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే లక్షా ఐదువేల పైబడి ఉన్న సింగరేణి ఉద్యోగాలను రాష్ట్ర ముఖ్యమంత్రి 42వేల ఉద్యోగాల వరకే కుదించేసి స్థానికంగా ఉన్న ప్రజలకు, 60వేల మంది యువతీ, యువకులకు ఉద్యోగాలు లేకుండా చేసినటువంటి పాలన రాష్ట్రంలో కొనసాగుతుండటం వల్ల మీరందరూ ఉద్యోగాలను కోల్పోయారు."_సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. భారీగా నాయకులు, కార్యకర్తలు వెంటరాగా మండుటెండలో పాదయాత్ర జోరుగా ముందుకు సాగింది. ఈ సందర్భంగా బూరుగుపల్లి గ్రామంలో ఆయన మాట్లాడారు. 'కోటపల్లి మండలంలో జరుగుతున్న ఇసుక మాఫియాలో పెద్ద తలకాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. చెన్నూరులో మిర్చి యార్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ చేయడంతో నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలతో సింగరేణిలో లక్ష ఉన్న కార్మికుల సంఖ్య నేడు 42 వేల మందికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు.'

"గొప్పగా ప్రచారం చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు పెద్దఎత్తున ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ప్రాణహిత_చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఇక్కడకు నీళ్లు వచ్చేవి. దాన్ని తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల నీళ్లు రాకపోగా దానివల్ల చెన్నూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట భూములన్నీ కూడా వరదలొచ్చినప్పుడల్లా ముంపునకు గురవుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మాటిస్తున్నాము. ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే ఇళ్ల స్థలాలను కూడా పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నాము. రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాము."_ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

'అధికారంలోకి వస్తే పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలతో పాటు స్థలం కూడా'..

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details