తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు వరం కాబోతున్న పట్నం చెత్త

పర్యావరణ దినోత్సవం నాటికి బెల్లంపల్లి మున్సిపాలిటీని ప్లాస్టిక్‌ రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడి అధికారులు. అందుకోసం చెత్తను కూడా ఉపయోగపడేలా  ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తడి చెత్తను కంపోస్ట్​ ఎరువుగా మారుస్తూ... రైతులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు.

By

Published : May 26, 2019, 7:58 PM IST

bellempally

చెత్త నిర్వహణకు సరికొత్త ఆలోచన

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలక సంఘంలో ప్లాస్టిక్​ను తరిమి కొట్టడానికి మున్సిపాలిటీ నడుం బిగించింది. మున్సిపల్ కమిషనర్ త్రయంబకేశ్వర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. బెల్లంపల్లి పట్టణంలో రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. పొడి చెత్తనుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసేందుకు ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఇప్పటికే వారికి సిద్దిపేటలో శిక్షణనిచ్చారు.

కూరగాయల మార్కెట్​లో వచ్చే వ్యర్థాలను సేకరిస్తున్నారు. దీన్ని కంపోస్ట్ ఎరువుగా మారుస్తున్నారు. ఇప్పటి వరకు 300 కిలోల వరకు తయారు చేశారు. తయారు చేసిన ఎరువును రైతులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను వేరు చేయడం కోసం రెండు డబ్బాలను అందిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ త్రయంబకేశ్వర్‌రావు పేర్కొన్నారు. జూన్‌ 5న పర్యావరణ దినోత్సవం నాటికి బెల్లంపల్లిని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: పేదల ఆకలి తీర్చే.. సర్వ్​ నీడీ

ABOUT THE AUTHOR

...view details