తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి' - బెల్లంపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలు తమ కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగించుకోవాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి సేవాసమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొని మహిళల కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన కల్పించారు.

Women's day at bellampally
Women's day at bellampally

By

Published : Mar 16, 2022, 8:42 AM IST

తమ రక్షణ కోసం రూపొందించిన చట్టాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన కల్పించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలో వివరించారు.

డ్యాన్స్ చేస్తున్న మహిళలు

అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామల, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు లక్ష్మి, మందమర్రి సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇందులో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details