మంచిర్యాలలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 29 అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిపై సమీక్షించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా త్వరితగతిన మిషన్ భగీరథ పనులు చేపట్టారని సూచించారు.