తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పిపోయిన పాప క్షేమంగా తల్లిదండ్రుల ఒడికి..! - మంచిర్యాలలో తప్పిపోయిన పాప

తప్పిపోయిన పాపను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు మంచిర్యాల పోలీసులు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

baby missing in manchiryal
తప్పిపోయిన పాప.. తల్లిదండ్రులకు అప్పగింత

By

Published : Mar 1, 2020, 8:07 PM IST

తప్పిపోయిన పాప.. తల్లిదండ్రులకు అప్పగింత

తప్పిపోయిన పాపను తల్లిదండ్రులకు అప్పగించారు మంచిర్యాల పోలీసులు. జిల్లా కేంద్రంలోని క్వారీ సమీపంలో మూడేళ్ళ చిన్నారి అటు ఇటు తిరగడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పాపను పోలీస్​స్టేషన్​కు తీసుకువచ్చి తల్లిదండ్రులు ఎవరు అనేది తెలుసుకోవడానికి విచారణ చేపట్టారు.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన రాజ్ కుమార్ తన కుటుంబంతో బ్రిక్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉదయం వేళ ఆడుకుంటూ వెళ్లినతమ చిన్నారి కనిపించలేదని తెలిపాడు. విచారణ చేసిన తర్వాత పాపను తల్లిద్రండులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు..

ABOUT THE AUTHOR

...view details