జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీలకు అవగాహన సదస్సు - RED CROSS AWARENESS
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీల నమోదు ప్రక్రియపై మంచిర్యాల జిల్లాలోని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీల సేవలు ప్రజలకి అందించేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పాఠశాల విద్యార్థులు సేవలో భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులు సూచించారు.
యూత్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కళాశాల విద్యార్థుల నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు రక్త దాన సేవలో భాగం కావాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 60 వేల మంది జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు స్పష్టం చేశారు.
TAGGED:
RED CROSS AWARENESS