తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆధునిక విజ్ఞానాన్ని మంచి కోసమే ఉపయోగించాలి' - online betting updates

ఆన్​లైన్ వేదికగా జరుగుతున్న మోసాలపై మంచిర్యాల జిల్లాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి యువతకు పలు సూచనలు చేశారు.

An awareness seminar was organized in Manchirala district on scams taking place as an online platform
'ఆధునిక విజ్ఞానాన్ని మంచి కోసమే ఉపయోగించాలి'

By

Published : Feb 4, 2021, 4:43 PM IST

యువత ఆన్ లైన్ ద్వారా జరిగే మోసాలకి దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని హాజీపూర్ మండలంలో యువతకు ఆన్​లైన్ మోసాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ యువత దేశానికి ఉక్కు సంకల్పంగా ఉండాలని సూచించారు. చాలా మంది యువత సెల్ ఫోన్ మోజులో పడి పబ్జీ, లోన్లు, ఆన్ లైన్ రమ్మీ, బెట్టింగ్​లకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

క్షణికావేశంలో..

ఇటీవలే హాజీపూర్ మండలంలో ఆన్ లైన్ జూదానికి అలవాటుపడి 32 ఏళ్ల వివాహితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వారిపై ఆధారపడిన వారిని రొడ్డున పడవేస్తున్నాయని వివరించారు. పెరుగుతున్న ఆధునిక విజ్ఞానాన్ని మంచి కోసమే ఉపయోగించాలని ఈ సదస్సులో ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:విషాదం: కుంటలో పడి నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details