మంచిర్యాల జిల్లా మందమర్రిలో అఖిలపక్షం నాయకులు ధర్నా నిర్వహించారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రైతులు వ్యతిరేకిస్తున్నా... మోదీ సర్కారు చట్టాలను రద్దు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆ చట్టాలను రద్దు చేయాలి... లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం' - మందమర్రిలో రైతుల ధర్నా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మందమర్రిలో అఖిలపక్షం నాయకులు ధర్నా నిర్వహించారు. అన్నదాతలు వ్యతిరేకిస్తున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
'ఆ చట్టాలను రద్దు చేయాలి... లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం'
కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ధర్నా చేశారు. లక్షలాది మంది అన్నదాతలు వ్యతిరేకిస్తున్న ఈ వ్యవసాయ చట్టాలను మోదీ సర్కారు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:కార్పొరేటర్ భర్త వీరంగం.. అనుచరులతో కలిసి దాడికి యత్నం