తెలంగాణ

telangana

ETV Bharat / state

టీజీబీకేఎస్​ అధ్యక్షుడితో కార్యకర్తల వాగ్వాదం.. - TGBKS president venkatrao latest news

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావుతో పలువురు కార్యకర్తలు, మాజీ నాయకులు వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా సంఘం కేంద్ర కమిటీ నాయకులను ఎంపిక చేస్తున్నారంటూ మండిపడ్డారు. అందరిని సంప్రదించి కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

TGBKS president
టీజీబీకేఎస్​ అధ్యక్షుడితో కార్యకర్తల వాగ్వాదం..

By

Published : Mar 31, 2021, 12:01 PM IST

నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కమిటీ నాయకులను ఎంపిక చేస్తున్నారంటూ ఆ సంఘం అధ్యక్షులు వెంకట్రావుతో పలువురు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి అతిథి గృహంలో ఆయనను నిలదీశారు.

దాదాపు 40 మంది కార్యకర్తలు, మాజీ నాయకులు అతిథి గృహం వద్దకు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా, రహస్యంగా కమిటీలు వేయడం సరికాదని, దీర్ఘకాలికంగా కార్మిక సంఘాన్ని నమ్ముకొని ఉన్నవారి సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గతంలో కార్యకర్తల సమక్షంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ఆయనకు గుర్తు చేశారు.

శ్రీరాంపూర్ ఏరియాలో ఏడాదికాలంగా ఫిట్ కార్యదర్శుల పదవులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. తమకు అనుకూలంగా ఉన్నవారికే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అందరిని సంప్రదించి కేంద్ర కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'చెంచులపై దాడి అసత్యం.. ఘర్షణ జరిగింది లంబాడి తెగ వారితో'

ABOUT THE AUTHOR

...view details