తెలంగాణ

telangana

ETV Bharat / state

లంచం తీసుకుంటూ దొరికిన అధికారి - today acb raids news

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిధిలోని సింగరేణి ఆర్కే న్యూటెక్ గని సంక్షేమ శాఖ డిప్యూటీ సూపరిండెంట్ వెంకటేశ్​ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు.

దొరికిన అధికారి
దొరికిన అధికారి

By

Published : Nov 28, 2019, 8:59 PM IST

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిధిలోని సింగరేణి ఆర్కే న్యూటెక్ గని సంక్షేమ శాఖ డిప్యూటీ సూపరిండెంట్ వెంకటేశ్​ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. సింగరేణి విశ్రాంత కార్మికులకు చెల్లించాల్సిన లబ్ధి విషయంలో ఆయన డబ్బులు డిమాండ్ చేశారు. రత్నం మొండయ్య జూలై 27న అనారోగ్యం కారణంగా ఆయన వారసుడు రాకేశ్​కు సింగరేణిలో ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. తన తండ్రికి రావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కోసం సంక్షేమ శాఖలోని అధికారి పదేపదే తిప్పించి... రూ. 30 వేలు లంచంగా ఇస్తే పని పూర్తి అవుతుందని చెప్పగా.. విసుగుచెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కరీంనగర్ అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ భద్రయ్య తన సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

ABOUT THE AUTHOR

...view details