మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేశారు. తర్వాత అక్కడ ఉన్న వందలాది వానరాలు ఆకలితో ఆలమటిస్తున్నాయి. ప్రతినిత్యం ఆలయానికి వచ్చే భక్తులు పండ్లు, కొబ్బరి అందించేవారు. ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు. ఆలయ అర్చకుడు సురేందర్ కోతుల ఆకలి చూడ లేక తానే స్వయంగా వండుకొని వానరాల ఆకలి తీరుస్తున్నాడు.
వానరాల ఆకలి తీరుస్తున్న అర్చకుడు - వానరాల ఆకలి తిరుస్తున్న అర్చకుడు
తాను అర్చకత్వం చేస్తున్న గుడిలో వానరాలు ఆకలితో అలమటిస్తుంటే చూడలేకపోయాడు. తానే స్వయంగా వండుకుని వచ్చి కోతులకు ఆహారాన్ని అందిస్తున్నారు మంచిర్యాల జిల్లా గూడెంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ అర్చకుడు సురేందర్.

వానరాల ఆకలి తిరుస్తున్న అర్చకుడు