సమర్థంగా పనిచేసిన రాజకీయ నాయకులకు పేరు గొప్ప ఆస్తి అనే ఆయనే నిదర్శనం. ఒకప్పుడు గ్రామ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు చేసిన వ్యక్తి నేడు కటిక పేదరికంలో ఉన్నాడు. సమర్థంగా పని చేసిన రాజకీయ నాయకులకు పేరు తప్ప కాసులు కూడబెట్టుకోరు అనే మాటకు ఆయనే ఉదాహరణ.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ పంచాయతీకి తొలి సర్పంచ్‌గా ఎన్నికైన ఏస్కూరి లింగయ్య. 1981 నుంచి వరుసగా రెండు పర్యాయాలు ఆ పదవిలో ఉన్నారు. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు అందినంత సంపాదించుకునే వాళ్లనే ఎక్కువగా చూస్తున్నాం. ఈయన మాత్రం అలా కాదు. సమర్థంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పేదరికంలో ఉన్నారు.