తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే దివాకర్​ రావు - లాల్ బహదూర్ శాస్త్రి

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని.. మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ ‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెరాస శ్రేణులతో కలసి దేశభక్తుల త్యాగాలను స్మరించుకున్నారు.

72nd Republic Day Celebrations in mancherial
ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

By

Published : Jan 26, 2021, 9:54 AM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్‌లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌ రావు హాజరై.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే.. పార్క్‌లోని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేశారు. తెరాస శ్రేణులతో కలిసి దేశభక్తుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఇదీ చదవండి:ఆకుకూరలతో దేశపటం.. ఆకర్షిస్తోన్న హరిత భారతం

ABOUT THE AUTHOR

...view details