తెలంగాణ

telangana

ETV Bharat / state

మరుగుదొడ్డి గుంతలో పడి ఐదేళ్ల చిన్నారి మృతి - died news

అప్పటి వరకు అటలాడుకుంటూ చెంగుచెంగున ఎగిరిన చిన్నారి... అచేతనంగా పడి ఉంది. ఎంతో అపురూపంగా చూసుకుంటున్న తల్లిదండ్రులకు మరుగుదొడ్డి గుంత రూపంలో వచ్చిన మృత్యువు చిన్నారిని బలిగొని... తీరని శోకాన్ని మిగిల్చింది.

5 years boy died due to fell down in letrin pit
మరుగుదొడ్డి గుంతలో పడి ఐదేళ్ల చిన్నారి మృతి

By

Published : May 31, 2020, 9:46 AM IST

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నజీర్​పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో పడి ఐదేళ్ల బాబు రిశ్వంత్ మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి.. ప్రమాదకరంగా ఉన్న గుంతను గమనించక అందులో పడ్డాడు.

ఎక్కడికెళ్లాడోనని కుటుంబసభ్యులు వెతకగా.. అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించాడు. హుటాహుటిన మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే బాలుడు మృతి చెందాడు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కుమారుడు అచేతనంగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చదవండిఃకరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!

ABOUT THE AUTHOR

...view details