మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన రెండు రోజుల్లో ఏకంగా 428 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రులలో రోజుకు 100 కరోనా నమూనా పరీక్షలు చేయాలని ఆదేశాలు రాగా పరీక్షల పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
మంచిర్యాలలో వారాంతాల్లో 428 కరోనా పాజిటివ్ కేసులు - corona cases in mancherial district update news
మంచిర్యాల జిల్లాలో శని, ఆదివారాల్లో ఏకంగా 428 కరోనా పాజిటివ్ కేసులు రాగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారాంతాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు మృతి చెందగా మృతుల సంఖ్య 29కి చేరినట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.
మంచిర్యాలలో వారాంతాల్లో 428 కరోనా పాజిటివ్ కేసులు
మంచిర్యాల జిల్లాలో శని, ఆదివారాల్లో 1, 546 మందికి పరీక్షలు నిర్వహించగా శనివారం 254, ఆదివారం 174 మంది కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల్లో ఇద్దరు మరణించగా.. మృతుల సంఖ్య 29కి చేరినట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తుండగా.. ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు.