మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో 350 నాటు కోళ్లు మృతి చెందాయి. ఎంబడి బుచ్చయ్య అనే రైతు తన ఎకరం భూమిలో ఫామ్ ఏర్పాటు చేసి నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. అకస్మాత్తుగా 350 కోళ్లు మృత్యువాతపడ్డాయి.
350 నాటు కోళ్లు మృతి... రూ.1.50 లక్షల నష్టం - 350 hens died in Kannepalli village
ఓ రైతు తన ఎకరం భూమిలో ఏర్పాటు చేసుకున్న ఫామ్లో అకస్మాత్తుగా 350 నాటుకోళ్లు మృతి చెందాయి. మరో 50 కోళ్లు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. అసలు ఈ కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఫామ్లో 350 కోళ్లు మృతి... రూ.1.5 లక్షల నష్టం
మరో 50 కోళ్లు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. దీనితో లక్ష 50వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు బుచ్చయ్య ఆవేదన చెందాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. బర్డ్ ఫ్లూ అనుమానంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.