మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల జోరు కొనసాగింది. నామపత్రాలు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం కనబరిచారు.
పదుల సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాలను దాఖలు చేశారు. అంతకు ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని నామినేషన్లు సమర్పించారు.
ఉత్సాహంగా రెండో విడత ఎన్నికలకు నామినేషన్లు - CHENNUR CONSTITUENCY
రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు మంచిర్యాల జిల్లా చెన్నూరులో జోరుగా నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాల దాఖలు
ఇవీ చూడండి : 'ఈనెల 29న మహాధర్నాకు తరలిరండి'