తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకానంద జయంతి సందర్భంగా 2K రన్ - మంచిర్యాలలో స్వామి వివేకానంద జయంతి

స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

2K run in Mancherial on the occasion of swamy Vivekananda Jayanti
వివేకానంద జయంతి సందర్భంగా మంచిర్యాలలో 2కే రన్

By

Published : Jan 12, 2021, 9:42 AM IST

మంచిర్యాల పట్టణంలో 2K రన్​ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఛైర్మన్ రాజయ్య జెండా ఊపి ప్రారంభించారు. స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో తెరాస యువజన విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి బాలుర పాఠశాల మైదానం వరకు రెండు కిలో మీటర్ల పరుగును నిర్వహించారు.

ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని యువజన నాయకులు ప్రసంగించారు.

ఇదీ చూడండి:యువతకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే..?

ABOUT THE AUTHOR

...view details