తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో 200 దాటిన కరోనా కేసులు - మంచిర్యాల జిల్లా కరోనా కేసులు

మంచిర్యాల జిల్లాలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం 21 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 200 దాటడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో కరోనా వైరస్ బారిన పడ్డ వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు వైద్యులకు ఈ మహమ్మారి సోకగా తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

coronavirus
coronavirus

By

Published : Jul 15, 2020, 10:14 AM IST

మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం 36 మంది నుంచి నమూనాలు సేకరించగా 21 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 200 దాటడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో 36 మంది నమూనాలను సేకరించి పరీక్షల కోసం వరంగల్ జిల్లాలోని కాకతీయ వైద్య కళాశాలకు రెండు దఫాలుగా పంపగా వాటి ఫలితాలు మంగళవారం రాత్రి ప్రకటించారు.

36 మందిలో 19 మందికి పాజిటివ్ వచ్చింది. 15 మందికి నెగిటివ్‌ రాగా మరో ఇద్దరికి మరోసారి పరీక్ష చేయాలని ల్యాబ్ నిర్వాహకులు తెలిపినట్టు జిల్లా నోడల్ అధికారి బాలాజీ తెలిపారు. జిల్లాలో కేసులు రెండు వందలు దాటడంతో జిల్లావాసుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు జిల్లాలో 503 నమూనాలు సేకరించగా 201 పాజిటివ్ వచ్చింది. 53 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 127 మంది కోలుకున్నారు. ఇద్దరు మృత్యువాత పడ్డారు.

జిల్లాలో కరోనా వైరస్ బారిన పడ్డ వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు వైద్యులకు ఈ మహమ్మారి సోకగా తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details