సోమవారం 20 పాజిటివ్ కేసులతో మంచిర్యాల జిల్లా ఉలిక్కిపడింది. జిల్లాలో 23 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా ఇరవై పాజిటివ్ కేసులు తేలినట్లు జిల్లా నోడల్ అధికారి డా.బాలాజీ తెలిపారు. మిగితా ముగ్గురికి నెగెటివ్ వచ్చిందన్నారు.
మంచిర్యాల జిల్లాలో కరోనా అలజడి.. ఒకే రోజు 20 కేసులు - మంచిర్యాలలో కరోనా కేసులు తాజావార్తలు
మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకూ కొవిడ్-19 కేసులు ఉద్ధృతమవుతున్నాయి. జిల్లాలో ఒక్కరోజులోనే 20 కేసులు నమోదు కావటం వల్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
మంచిర్యాలలో కరోనా అలజడి
మంచిర్యాల పట్టణంలో 10, హాజీపూర్ మండలంలో 2, మందమర్రిలో 2, నస్పూర్ మండలంలో 5, బెల్లంపల్లిలో ఒక్కరికి పాజిటివ్‌గా తేలాయని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు 421 మందికి శాంపిల్స్ సేకరించగా 151 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు.