తెలంగాణ

telangana

ETV Bharat / state

Private hospitals: 19 ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులు రద్దు - Private hospital permits revoked in mancherial

Private hospitals in Mancherial: మంచిర్యాల జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్​ ఆస్పత్రులపై జిల్లా వైద్యారోగ్యశాఖ ఉక్కుపాదం మోపింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 19 ఆసుపత్రుల అనుమతులు రద్దు చేస్తూ తాళాలు వేసింది. వారం రోజుల పాటు ఈ దాడులు కొనసాగనున్నాయి.

19 Private hospitals permit revoked
19 ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులు రద్దు

By

Published : Apr 8, 2022, 9:17 AM IST

Private hospitals in Mancherial: ప్రైవేటు ఆసుపత్రులపై మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝళిపించింది. కొన్ని ఆసుపత్రుల్లోని వైద్యులు తాము చదవని విభాగాల సూచికలు ఏర్పాటు చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఇటీవల వచ్చిన ఫిర్యాదులతో ఆరోగ్యశాఖ కదిలింది. రెవెన్యూ, పోలీసులు, ఐఎంఏ సహకారంతో గురువారం జిల్లా వ్యాప్తంగా ఐదు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 19 ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులను రద్దు చేస్తూ తాళాలు వేసింది.

కలెక్టర్‌ భారతి హోళ్లికేరి ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ అధికారి డా. సుబ్బారాయుడు, ఇతర అధికారులు కొన్ని రోజులుగా కసరత్తు చేసి ఈ తనిఖీలు చేశారు. జిల్లాలో మొత్తం రెండు వందలకు పైగా ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. వారం రోజుల పాటు దాడులు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని ఏ ఒక్క ఆసుపత్రినీ వదలబోమని వైద్యాధికారులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:గ్రూపు-​ 1 అభ్యర్థులకు వారి నుంచి గట్టి పోటీ.. కారణాలివే.!

ABOUT THE AUTHOR

...view details