తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాల జిల్లాలో కొత్తగా 17 పాజిటివ్​ కేసులు - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లాలో తాజాగా 17 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా 58 యాక్టివ్​ కేసులు ఉన్నాయని నోడల్​ అధికారి బాలాజీ తెలిపారు.

17 new corona positive cases
మంచిర్యాలలో కొత్తగా 17 పాజిటివ్​ కేసులు

By

Published : Jul 10, 2020, 6:12 PM IST

మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. జిల్లాలో తాజాగా 22 మందికి కరోనా పరీక్షలు చేయగా 17 మందికి పాజిటివ్​ వచ్చింది. మంచిర్యాల పట్టణంలో 9, నస్పూర్​లో 4, జైపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ పట్టణాలలో ఒక్కొక్కరు చొప్పున వైరస్​ బారిన పడ్డారు.

కరోనా బాధితులందరినీ బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 58 యాక్టివ్​ కేసులు ఉన్నాయని... 111 మంది వైరస్​ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారని నోడల్ అధికారి బాలాజీ తెలిపారు.

ఇదీ చూడండి:నేను ఆసుపత్రిలో ఉండను.. కరోనా బాధితుడి హల్​చల్​

ABOUT THE AUTHOR

...view details