సుడా, డీటీసీపీ లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతులున్న ఇళ్ల స్థలాలు, భూములు, భవనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ చిరంజీవులు ఉత్తర్వులపై నిరసన వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సబ్రిజిస్ట్రార్తో వాగ్వాదానికి దిగారు.
శాఖల మధ్య సమన్వయం లేకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారు? - zadcharla real estate businessman protest in registration office
అన్ని అనుమతులున్న ఇళ్ల స్థలాలు, భూమిలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను నిరసిస్తూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. ముందస్తుగా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయకుండా ఎలా ఉత్తర్వులు జారీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జడ్చర్ల రిజిస్ట్రార్ కార్యాలయంలో స్తిరాస్థి వ్యాపారుల నిరసన
ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం మరోమారు సమీక్షించాలని డిమాండ్ చేశారు.