మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచరకల్లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వెంకయ్యతో గొడవ పడి గ్రామ సమీపంలోని కుంటలో పడి శ్యామలమ్మ(35) బలవన్మరణానికి పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టారు. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య