తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి - అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌ మండల కేంద్రంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. జాతీయ రహదారి వంతెనపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి

By

Published : Aug 28, 2020, 2:32 AM IST

మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం ధర్మపూర్‌ గ్రామానికి చెందిన అలివేలు బుధవారం సాయింత్రం ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు వెళ్తానని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఎంతకు తిరిగిరాలేదు. కాగా.. గురువారం భూత్పూర్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారి వంతెనపై మృతి చెంది ఉంది. మృతురాలి చరవాణి ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ధర్మపూర్‌ గ్రామానికి చెందిన అలివేలుగా గుర్తించారు.

ఏదైనా వాహనం ఢీకొని ఉండటంతో మహిళ చనిపోయి ఉండవచ్చునని పోలీసుల అనుమానిస్తున్నారు. గతంలో తండ్రి చనిపోగా.. ఇప్పుడు తల్లికూడా మృతి చెందడం వల్ల ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మృతిరాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:బాలీవుడ్​కు 'డ్రగ్స్' మరక.. ​గుట్టు బయటపెడతానన్న కంగన

ABOUT THE AUTHOR

...view details