మహబూబ్నగర్ జిల్లా కేశవరావుపల్లి పంచాయతీ పరిధిలోని పిలెట్నగర్కు చెందిన నరసింహులు, యాదమ్మ భార్యభర్తలు. యాదమ్మ గత నెల 30న వేరే గ్రామానికి వెళ్తుండగా... రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలైంది. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఆమె మరణించినట్లు భర్తకు సమాచారం వచ్చింది. ఇల్లాలి మరణాన్ని తట్టుకోలేకపోయిన నరసింహులు వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చనిపోయిన కొద్దిక్షణాలకే.. భర్త ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యుల్ని శోకసంద్రంలో ముంచింది. వీరి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నీవు లేనిది నేను లేను... నీ వెంటే నేనొస్తా.. - మహబూబ్నగర్
పొలంలో ఓ రైతు పనిచేసుకుంటున్నాడు. ఇంతలో ఓ సమాచారం అతని చెవిలో పడింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన భార్య చికిత్స పొందుతూ.. మృతి చెందిందని తెలిసింది. అంతే ఆ రైతు తట్టుకోలేకపోయాడు. ఇల్లాలు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. ఆళి మరణాన్ని తట్టుకోలేక వ్యవసాయ పొలంలో ఉరి వేసుకుని తానూ.. తనువు చాలించి చావులోనూ తోడుగా వెళ్లాడు.
నీ వెంటే నేనొస్తా