మహబూబ్నగర్ జిల్లాలో.. ప్రసిద్ధి చెందిన సంతల్లో దేవరకద్ర పశువుల సంత ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ పశువులను కొనేందుకు.. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. వారితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి రైతులు క్రయవిక్రయాలు చేసేందుకు.. ఆసక్తి చూపుతుంటారు. ఈసంత నిర్వహణతో పశువులను రవాణా చేసే వాహనాలతో పాటు.. అనుబంధ అవసరాలను తీర్చే.. హోటళ్లు, టీ కొట్లు, సోడా లెమన్, ఇతర తినుబండారాలను విక్రయిస్తూ కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాాయి.
సడలింపులతో దేవరకద్ర వారాంతపు సంతలో నూతనోత్సాహం... - దేవరకద్ర పశువుల సంత తాజా వార్త
పల్లె జీవనానికి ప్రతీకలు వారపు సంతలు. వీటికి దశాబ్దాల చరిత్ర ఉంది. గ్రామీణులకు అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికీ ఎక్కువ మంది వారపు సంతల్లో వస్తువుల కొనుగోలుకే ఇష్టపడతారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో వారపు సంతలు రద్దు అయ్యాయి. అయితే అన్లాక్ సడలింపులతో ఇప్పుడిప్పడే వారాంతపు సంతలు ప్రారంభమవుతున్నాయి. ఇవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వేలాది మందికి ఉపాధిని కల్పిస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సడలింపులతో దేవరకద్ర వారాంతపు సంతలో నూతనోత్సాహం...
పశువుల అలంకరణ వస్తువులు, గొర్రెల రక్షణకు అవసరమైన వలలతో పాటు.. వివిధ రకాల సామగ్రిని ఇక్కడ విక్రయిస్తుంటారు. ఇలా ఈసంత వందల మందికి జీవనోపాధి కల్పిస్తూ వారి కుటుంబ పోషణకు తోడ్పడుతుంది. దేవరకద్రలోని పశువుల సంత వల్ల గ్రామ పంచాయతీకి ఏటా 50 లక్షలకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తూ సుమారు ఐదు వందల కుటుంబాలు.. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి పొందటం గమనార్హం. లాక్‌డౌన్ సడలింపుతో ఈ కుటుంబాల్లో.. తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి.
ఇదీ చూడండి:'రుణాల మంజూరులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు'