మహబూబ్నగర్ జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హరితహారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన రహదారిలో మొక్కలు నాటారు. పాలమూరు పట్టణాన్ని సుందరీకరణ చేయనున్నామని.. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పాలమూరు రూపురేఖలను మార్చి హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.
'పాలమూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం' - మహబూబ్ నగర్ జిల్లా
మహబూబ్నగర్ జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

హైదరాబాద్కు ధీటుగా పాలమూరును అభివృద్ధి చేస్తాం