తెలంగాణ

telangana

ETV Bharat / state

కిసాన్​ మేళా... - minister srinivas goud

పాలమూరులో రైతుల కోసం ఏర్పాటు చేసిన కిసాన్​ మేళాను ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది

By

Published : Mar 1, 2019, 9:09 PM IST

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది
రానున్న ఐదేళ్లలో ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని ఆబ్కారి, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళాను ప్రారంభించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రైతుల కోసం స్టాళ్లు పెట్టారు.

కోర్టు కేసులు

మొట్టమొదటగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించినా.. ఈ ప్రాంత నాయకులే అడ్డుకున్నారని శ్రీనివాస్​ గౌడ్​ మండిపడ్డారు. కోర్టు కేసులు లేకుంటే ఇతర ప్రాజెక్ట్‌లతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తై.. పోలాలు సస్యశ్యామలం అయ్యేవన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్ట్‌లకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉన్నా.. ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతకుముందు మత్స్యకారులకు మోటర్‌సైకిల్‌లను అందజేశారు.

ఇదీచూడండి:పైలట్​ను విమానం ఎక్కించని పాక్​

ABOUT THE AUTHOR

...view details