తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో ఉపాధి కోల్పోయాం.. ఆదుకోండి: ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది - పాఠశాలల సిబ్బందిపై కరోనా పంజా

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల నిర్వహకులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి వారు వేడుకుంటున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మమ్మల్ని మీరే ఆదుకోవాలి.. ప్రైవేటు పాఠశాలల సిబ్బంది విజ్ఞప్తి
మమ్మల్ని మీరే ఆదుకోవాలి.. ప్రైవేటు పాఠశాలల సిబ్బంది విజ్ఞప్తి

By

Published : Sep 8, 2020, 7:56 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయని... తాము ఉపాధి కోల్పోయామని పాఠశాలల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో తమ ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆర్నెళ్లుగా ఎలాంటి ఆదాయం లేక తాము గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని తెలిపారు.

కొవిడ్‌- 19 పేరుతో పాఠశాలలను మూసివేసి.. జిమ్‌లు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇచ్చారన్నారు. పాఠశాలల దీనస్థితిని చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ విశయమై అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని.. బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అదించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details