మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి దగ్గరలో కొత్త చెరువు తూము లీకేజీని అధికారులు కట్టడి చేశారు. రైతులు ఇచ్చిన సమాచారంతో జిల్లా అదనపు కలెక్టర్ త్వరితగతిన చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. తూము దగ్గర ఉండే గేటు ద్వారా నీరు బయటకు రావడంతో మట్టిని బస్తాలలో నింపి అడ్డుగా వేశారు.
చెరువు తూము లీకేజీకి యుద్ధప్రాతిపదికన చర్యలు - మహబూబ్నగర్ జిల్లా తాజా వార్తలు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో కొత్త చెరువు తూము నుంచి లీకేజీ అవుతున్న నీటిని అధికారులు కట్టడి చేశారు. ఉదయం నుంచి తూము ద్వారా నీరు లీకవడంతో స్థానిక రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ చర్యలు చేపట్టారు.
చెరువు తూము లీకేజీకి యుద్ధప్రాతిపదికన చర్యలు
ట్రాక్టర్ల ద్వారా ఎర్రమట్టిని తరలించి తూమును మూసివేశారు. దాదాపు రెండువందల ఏళ్ల చెరువు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ లీకేజీలు సాధారణమేనని గేటు వద్ద నీరు లీకేజీని అరికట్టామని ఇరిగేషన్ శాఖ డీఈ మనోహర్ తెలిపారు.