మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 6 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రాదేశిక ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. ఓ మహిళ భర్త చనిపోయినప్పటికీ... మృతదేహం ఇంట్లోనే ఉన్నా.. ఓటేసేందుకు వచ్చింది. ఓటు ప్రాధాన్యతను తోటి ఓటర్లకు తెలిపి ఆదర్శంగా నిలిచింది.
భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ - CHAITANYAM
భర్త చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ... రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఓటేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది ఉమ.
భర్త చనిపోయినా ఓటేసి ఆదర్శంగా నిలిచిన ఉమ
దేవరకద్రకు చెందిన శ్రీనివాసులు కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఎన్నికలు ఉన్నందున గురువారం స్వగ్రామానికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. విషయం గమనించిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లేలోపే శ్రీనివాసులు మృతి చెందాడు. శోకసముద్రంలోనూ ఆ కుటుంబ సభ్యులు పోలింగ్లో పాల్గొనడాన్ని గ్రామస్థులంతా అభినందించారు.
ఇవీ చదవండి: ఓటేయడానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించిన విఘ్నేష్
Last Updated : May 10, 2019, 12:48 PM IST