తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు - సరైన నాయకుడిని ఎన్నుకోండి

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో  ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం

By

Published : Apr 8, 2019, 8:32 PM IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యం ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్​ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సరైన నాయకుడిని ఎన్నుకోండి

గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ వాసులు, చదువుకున్నవారు ఓటేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతరంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. చదువుకున్న వారంతా విధిగా తమ తమ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నిజాయతీ కలిగిన నాయకుడిని ఎన్నుకుంటే సమస్యలు వేగంగా తీరుతాయన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం

ఇదీ చదవండి: ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: ప్రశాంత్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details