రాష్ట్ర జైళ్లశాఖలో వచ్చిన మార్పులపై హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించే అవకాశం కలిగిందని జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సిటిజన్ ఫోరం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఎవరు బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యతలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని... తెలంగాణలో నాలుగువేల ప్రాథమికోన్నత పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు చదివేందుకు ఇష్టపడట్లేదన్నారు. గ్రామస్థాయిలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే దేశం బాగుపడుతుందని వీకే సింగ్ అభిప్రాయపడ్డారు.
జైళ్లశాఖ డీజీకి హార్వర్డ్‌లో ప్రసంగించే అవకాశం - harword
జైళ్ల శాఖలో వచ్చిన మార్పులపై హార్వర్డు విశ్వవిద్యాలయంలో అవకాశం కలిగిందని జైళ్లశాఖ డీజీ వీకే సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.
జైళ్లశాఖ డీజీకి హార్వర్డ్‌లో ప్రసంగించే అవకాశం